వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. రూ.45 కోట్లతో నస్కల్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి మరియూ ఎమ్మెల్యే టి రాంమోహనరెడ్డ్ పరిగి మున్సిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో రూ.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ఐటీఐ భవనానికి రాష్ట్ర గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి , పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.యువతకు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని,అందులో భాగంగానే పరిగి నియోజకవర్గానికి నస్కల్‌లో రూ.45 కోట్లతో ఈ ఏటీసీ నిర్మాణం చేపట్టామని చెప్పారు.
ఈ ATC భవనంలో అన్ని రకాల ఆధునిక సాంకేతిక,నైపుణ్య కోర్సులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.ఈ కేంద్రం ద్వారా ఒకేసారి సుమారు 200 మంది విద్యార్థులకు శిక్షణ అందించడంతో పాటు, శిక్షణ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుందని, ఏటీసీ లో నైపుణ్య కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే శిక్షణ అనంతరం విద్యార్థులు మన సమీపంలో నిర్మాణంలో ఉన్న లగచర్ల పారిశ్రామిక వాడల్లో పనిచేసే అవకాశాలు కూడా విస్తృతంగా ఉంటాయని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


