జూలై 7, 2026
TRINETHRAM NEWS
AI-based complaint recorder launched

AI-based Complaint Recorder : త్రినేత్రం న్యూస్ : May 23, 2026, తెలంగాణ : దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు రికార్డర్‌ఏఐ కాప్‌రైటర్‌‘ యాప్‌ను హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ యాప్‌ ద్వారా 10కిపైగా భాషల్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. చెప్పిన విషయాలను వెంటనే టెక్ట్స్‌గా మార్చి అనువదించే సదుపాయం ఉంది.

ఫిర్యాదు వివరాలు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్‌ రూపంలో సేవ్ అవుతాయి. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. భాష న్యాయానికి అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ఏఐని ఉపయోగిస్తున్నారు. తొలుత హైదరాబాద్‌లోని 80కి పైగా పోలీస్‌స్టేషన్లలో ఈ యాప్‌ అందుబాటులోకి రానుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page