Additional Collector : ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్ డి.వేణు

TRINETHRAM NEWS

పెద్దపల్లి, అక్టోబర్ 27: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన దార సతీష్ గ్రామంలోని సర్వే నెంబర్ 563 లో గల 16 గుంటల ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వీటిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన మంథని లక్ష్మీ అలియాస్ సంధ్య లొంగిపోయిన నక్సలైట్ పునరావాసం క్రింద జీవనోపాధి కోసం కుక్కల గూడూరు గ్రామ శివారు సర్వే నెంబర్ 309 లో 5 ఎకరాల భూమి కేటాయించి పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్

ఈ విభాగం పర్యవేక్షకులకు రాస్తూ ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు రామగుండం మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన భోజరాజు తన బాగోగులు పట్టించుకోకుండా ఇంటిలో నుండి గెంటేసిన తన కుమారుడు శ్రీధర్ పై తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంక్షేమ చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ డివిజన్ అధికారిక రాస్తూ చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కమాన్ వాడ వాస్తవ్యులు వేణు మాధవ్ కమర్షియల్ ఏరియా లోని వెనకాల స్థలం చిత్తడిగా ఉందని, అందులో నుండి పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని, అక్కడ చిత్తడి లేకుండా శుభ్రం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Additional Collector D. Venu receives Prajavani applications

You cannot copy content of this page

Scroll to Top