National Handloom Day : చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వ కృషి అదనపు కలెక్టర్ డి.వేణు

TRINETHRAM NEWS

పెద్దపల్లి, ఆగస్టు -07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకలలో అదనపు కలెక్టర్ బి.వేణు పాల్గొన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ మెయిన్ గేట్ నుంచి సమావేశం మందిరం వరకు చేనేత కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీతలైన చేనేత కార్మికులకు, సీనియర్ నేతన్నల ను అదనపు కలెక్టర్ డి.వేణు శాలువాలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి.వేణు మాట్లాడుతూ, చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగంలో వాడే వివిధ యూనిఫామ్, స్కూల్ పిల్లల బట్టలు, మహిళా సంఘాలకు అందించే చీరలను చేనేత కార్మికుల వద్ద ఆర్డర్ చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ సూచించారు అనంతరం చేనేత రంగం పై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నరేందర్, పిడి హౌసింగ్ రాజేశ్వర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, నేత కార్మికులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government's Efforts to Strengthen Handloom Sector

You cannot copy content of this page

Scroll to Top