Ketawat Baburam Naik : దేవరకొండ, మల్లేపల్లి పట్టణాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS

గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్

దేవరకొండ జులై 18 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ మరియు మల్లేపల్లి పట్టణాల్లో కొంతమంది వ్యక్తులు విద్యా రంగాన్ని వ్యాపారంగా మార్చి, అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ళు నిర్వహిస్తూ పిల్లల భవిష్యత్‌ను ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
ఈ కోచింగ్ సెంటర్లు విద్యా శాఖ నుండి గుర్తింపు లేకుండా నడుస్తూ, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించి స్కూల్‌లో చదివించాలనే స్థిర నిర్ణయాన్ని దెబ్బతీస్తున్నాయి. విద్యా ప్రమాణాలు లేని, సిబ్బంది అర్హతలు లేని, భద్రతా ప్రమాణాలు పాటించని ఈ కోచింగ్ కేంద్రాల్లో విద్యార్థుల భవిష్యత్‌ ఒక అంధకారంలో నెట్టివేయబడుతోంది.
అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ఈ కేంద్రాల్లోని నిర్వాహకులు ప్రభుత్వ అధికారులపై తమ నియంత్రణ ఉందన్న అహంకారంతో తల్లిదండ్రులకు, స్థానిక నాయకులకు సూటిగా చెబుతున్నారు ఎక్కడైనా ఫిర్యాదు పెట్టుకోండి మేము అందరికీ మేనేజ్ చేశాం మాకు ఎవరు ఏమీ చేయలేరు అని యాజమాన్యం తీరు ఉంది ఈ తీరును గిరిజన సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఈ విధంగా వ్యవహరించేవారిపై తక్షణమే దర్యాప్తు జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ బాబు రామ్ నాయక్ డిమాండ్ చేశారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

coaching centers running without permission

You cannot copy content of this page

Scroll to Top