Minister NMD Farooq : దారుల్ ఉలూమ్ సబీలుల్ హుదాలో ‘అబ్నాయే ఖదీమ్’ (పూర్వ విద్యార్థులు) సదస్సు విజయవంతం

TRINETHRAM NEWS

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫరూక్

Trinethram News : నంద్యాల దారుల్ ఉలూమ్ సబీలుల్ హుదా ఆధ్వర్యంలో బుధవారం భీమవరం రోడ్ లో ఉన్న మస్జిదే ఆలుఫర్ఖాన్ నందు ‘అబ్నాయే ఖదీమ్’ (పూర్వ విద్యార్థుల) సదస్సు ఘనంగా జరిగింది. సంస్థలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సేవలను పరిచయం చేయడం మరియు వారి అనుభవాలను పంచుకోవడంలో పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ “దారుల్ ఉలూమ్ సబీలుల్ హుదా సంస్థ కేవలం ధార్మిక విద్యకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ఉత్తమ సామాజిక బాధ్యతలను, విలువలను కూడా నేర్పిస్తోందని. తద్వారా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ, దేశాభివృద్ధిలో క్రియాశీల భాగస్వాములను చేయడం నిజంగా అభినందనీయం” అని ప్రశంసించారు. “పూర్వ విద్యార్థులు వైద్యం, విద్య, వాణిజ్యం మరియు సామాజిక సేవ వంటి వివిధ రంగాలలో అందిస్తున్న విశేష సేవలు ఆదర్శప్రాయని . సంస్థ ద్వారా పొందిన విజ్ఞానంతో సమాజానికి మేలు చేస్తున్న వారి కృషిని అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, దేశం గర్వించే విధంగా తమ వంతు సేవలు అందించాలని మంత్రి ఫరూక్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అబ్దుల్ హదీ , మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ , షరీఫ్ , మున్నా , అహ్మద్ , ఈదుల మౌలానా , రఫీ , వలి , జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సబిహ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

'Abnaye Khadeem' (Alumni) Conference Successful

You cannot copy content of this page

Scroll to Top