వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్ …
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 9. మండపేట… మాదిగ జాతి సమైక్యతను చాటి చెప్పేందుకు ఈనెల 11వ తేదీన అమలాపురం పేరూరు కొంకాపల్లి ఎత్తు రోడ్డు సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మాదిగల ఆత్మీయ కలయిక నిర్వహిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ తెలిపారు. మాజీ ఎంపీ నందిగమ సురేష్ ను ఆయన స్వగృహం తాడేపల్లి ఉద్దండరాయ పాలెం ఆయన స్వగృహం లో మంగళ వారం ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తో కలసి సుధాకర్ అక్కడికి వెళ్ళారు. ఆత్మీయ సభ రావాలని ఆహ్వానించించారు. తను అమలాపురం వస్తానని సురేష్ చెప్పారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ మాదిగల ఐక్యతను చాటి చెప్పేందుకు ఈనెల 11వ తేదీన సత్యమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మాదిగల ఆత్మీయ కలయికను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఆత్మీయ కలయిక సభకు మాదిగ కులానికి సంబంధించిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలను ఆహ్వానిస్తున్నామన్నారు.
రాబోయే రోజుల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వీభజన అయితే రెండు ఎమ్మెల్యే స్థానాలు మాదిగలకు కేటాయించాలని కోరారు. మాదిగలను గుర్తిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఆయనతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంట్లెక్చువల్ ఫారం కార్యదర్శి కొడమంచిలి హరీష్ ఆయనతో ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


