Major Accident : మందపల్లిలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఆదివారం టిప్పర్ లారీని మరో లారీ ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు కథనం ప్రకారం మందపల్లి చిన వంతెన వద్ద ముందు వెళ్తున్న ఇసుక లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న మరో లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో లారీడ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కు పోవడంతో స్థానికులు సురక్షితంగా కాపాడారు.

ఎవరికి ఎటువంటి ప్రమాదం జరక్క పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఇసుక లారీల అతి వేగంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు,స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రోజుకు ఎన్ని ట్రిప్పులు వేశామనే ధ్యాసే తప్ప, సురక్షిత ప్రయాణం గురించి వారు ఏమాత్రం ఆలోచించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతివేగమే అన్నింటికీ అనర్ధమని వారు గ్రహించలేకపోతుండడం దురదృష్టకరం.ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీల అతివేగానికి బ్రేకులు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A major accident was

You cannot copy content of this page

Scroll to Top