బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వసూలు చేస్తున్న సెస్ నిధులు దోచుకోవడం ఆపండి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఇంజనీర్స్,బిల్డర్స్ చెల్లిస్తున్న సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అమలు చేయండి
కాకినాడ,జూన్,08: ది. కాకినాడ జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ఏఐటీయూసీ, అనుబంధ సంఘం నెలవారి సమావేశం ఆదివారం ఉదయం కాకినాడలో స్థానిక వీర్ కమల్ థియేటర్ వద్ద టీ అన్నవరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ లో బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, రోడ్స్ తదితర నిర్మాణాల్లో 1 శాతం సెస్ వసులు చేస్తున్న నిధులను ప్రభుత్వం దోచుకోవడం ఇకనైనా ఆపండి అని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగిస్తూ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకునిధులను వాడుకుందని, భవన నిర్మాణ కార్మికులు ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీని సంవత్సరకాలం పూర్తి అయిన ఇప్పటివరకు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని, భవన నిర్మాణ కార్మికుల ఘోష ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా అని ఆయన అన్నారు.

ఈ ప్రభుత్వ సంక్షేమ బోర్డు నిధులు దోచుకున్న సంక్షేమ పథకాల అమలు చేయకున్నా గత ప్రభుత్వానికి పట్టిన గత ఈ ప్రభుత్వానికి పడుతుందని ఆయన అన్నారు. ఇంజనీర్స్, బిల్డర్స్, నిర్మాణాలు చేపడుతున్న వారందరూ ప్రభుత్వానికి సెస్ రూపంలో చెల్లిస్తున్న నిధులు కార్మికుల కొరకు చెల్లించినవని ఆ నిధులు భవన నిర్మాణ కార్మికుల ఖర్చు చేయాలని, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని సాధారణ, యాక్సిడెంట్, డెలివరీ, మ్యారేజ్, హాస్పిటల్లైజేషన్ తదితర క్లెయిమ్స్ తక్షణమే అమలు చేయాలని, సంక్షేమ పథకాల అమలుపై కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. యోగాంధ్రా పేరుతో ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా మెయిన్ రోడ్లను మూయించడం సరికాదని, ప్రభుత్వ నిధులతో యోగేంద్ర కార్యక్రమాల్లో నిర్వహించడం కాకుండా ఆయా ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ద్వారా నిధులు ఖర్చు చేయాలని అలాకాకుండా ప్రభుత్వ నిధులు దుర్వినియోగించి మొత్తం ఈ కార్యక్రమానికి ఖర్చు చేస్తే ప్రజల సహించరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం దుర్గాప్రసాద్, టి శ్రీనివాస్, శేఖర్, జి.సత్యనారాయణ, కుమార్, చిన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Stop looting the cess

You cannot copy content of this page

Scroll to Top