టిబిజికెఎస్ నాయకులను బదిలీల పేరిట ఇబ్బందులు పెడుతున్నారు
రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి లో రాజకీయ జ్యోకం ఎక్కవ అయ్యుంది.తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులను బదిలీలతో వారిని మానసీకంగా అందోళనకు గురిచేస్తున్నారని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. టి.బి.జి.కె.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి నాయకులు బాలసాని కోమురయ్య బదిలీలు నిలిపి వేయాలని శనివారం ఆర్జీ 2 జిఎం కు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం అందించారు. అనంతరం మిడియాతో మాట్లాడుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, నాయకులు బాలసాని కొమురయ్య లను అకారణంగా బదిలీ చేయటం అత్యంత విచారకరం అన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేనప్పటికిని ఈ బదిలీలు చేయటం కార్మిక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యగా అన్నారు.
మాదాసి రామమూర్తికి 13 నెలల సర్వీసు, బాలస్వామి కొమరయ్యకు 8 నెలల సర్వీస్ మాత్రమే ఉంది. పదవి విరమణకు దగ్గరగా ఉన్న సమయంలో బదిలీ చేయటం ఆ కుటుంబాలను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టి చర్య మాత్రమే అవుతుందన్నారు
ఏకపక్షంగా, ఆకారణంగా చేసిన బదిలీలను రాజకీయ ప్రేరేపిత చర్య అని, పనిలో ప్రతిభ, వ్రుత్తిపట్ల నిబద్ధత కలిగిన ఉత్తమ ఉద్యోగులను బదిలీ చేయడం సంస్థకే నష్టదాయకం అన్నారు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం నినాదంతో పనిచేసి సింగరేణి సంస్థ లో రాజకీయ జోక్యాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని , బదిలీ చేసిన వారిమి సర్వీస్ కాలాన్ని, వారి పనితీరులను పరిగణలోకి తీసుకొని మానవతా దృక్పథంతో తక్షణమే వారి బదిలీలను నిలుపు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయకులు అయులి శ్రీనివాస్ నారాయణదాసు మారుతి ప్రభాకర్ రెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


