ఐ. కృష్ణ. ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టీ యు) పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం గోదావరిఖని. గాంధీ నగర్ లోని ఐ ఎఫ్ టీ యు కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ. మాట్లాడుతూ.. రాష్ట్రం లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విడనాడాలని కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి,రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కే జీ బీ వీ లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు పెంచకుండా అధిక పని చేయిస్తూ శ్రమను దోపిడి చేస్తున్నారని అన్నారు.
తక్షణమే కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం జీవో నంబర్ 282 ను చట్టబద్ధం చేసిందని 8. గంటల నుండి పది గంటలు పెంచడం వలన కార్మికుల శ్రమ దోపిడీ గురవుతారన్నారు.పని గంటల పెంపు జీ ఓ రద్దు చేయాలనీ అన్నారు.ఆటో కార్మికులకు 12 వేలు ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలన్నారు.గ్రామపంచాయతీ కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, హాస్పిటల్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని, హమాలీ, మోటార్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు ప్రమాద బీమాను కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల దృష్టి సారించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారాని కై పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్,ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు ఈదునూరీ రామకృష్ణ , ఐ రాజేశం, ఎం దుర్గయ్య, జీ మల్లేశం, బి బుచ్చయ్య,పి స్వామి, కే ఎల్లయ్య, బి కొమరయ్య, తోట్ల రాయమల్లు,చింతల శేఖర్, ఎస్ ప్రసాద్. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


