తేదీ : 16/11/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); కంచికచర్ల నియోజకవర్గం, మండలం, కీసర టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి ముందుగా బైక్ ను ఢీకొట్టడం జరిగింది. ఆ తరవాత ట్యాంకర్ ను ఢీ కొట్టింది. కొద్దిసేపటికి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్నటువంటి ప్రయాణికులు ఆ సమయానికి బయటికి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


