
స్పోర్ట్స్ అసోషియేషన్స్ ఆధ్వర్యంలో పితృ దినోత్సవ వేడుకలు ఘనంగా.
International Yoga Day : దేవరకొండ డివిజన్ జూన్ 21, త్రినేత్రం న్యూస్ : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు ఆదివారం రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగ గురువులు ఓంకారం మరియు వెంకటేశ్వర్లు విద్యార్థులచే యోగాసనాలు వేయించి యోగా గురించి వివరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వీ టి మాట్లాడారు అంతర్జాతీయ యోగా దినోత్సవ మరియు అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగ వల్ల శారీరిక దృఢత్వం మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత పెరుగుతాయని ఒత్తిడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని, అలాగే శరీర వశ్యతను మెరుగుపరిచి కండరాల నొప్పులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుందని, గుండెపోటు రాకుండా ఉంటుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఉదయాన్నే యోగా చేయాలని అన్నారు.
అనంతరం అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి ఎం భాస్కర్, తాళ్ల సురేష్, కరాట మాస్టర్ గోపి, పందిరి వెంకన్న, బత్తుల సురేష్ ,రాజేష్, మురళి, రాఘవేందర్, పందిరి జ్యోతి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పీ ఈ టి రజిత, ట్రైబల్స్ స్కూల్ విద్యార్థులు పి డి మహేశ్వరి ,జ్ఞానేశ్వరి, క్రీడాకారులు కళాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe