
AP Cabinet :▪️విశాఖలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పై చర్చ. సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంపై సమీక్ష.
▪️రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆమోదం.
▪️నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఆమోదం.
▪️తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమకు ఆమోదం.
▪️భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ కు ఆమోదం.
▪️పశ్చిమగోదావరి తణుకులో రవళి స్పిన్నర్స్ రూ.237 కోట్ల పరిశ్రమ విస్తరణకు ఆమోదం.
▪️నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల కేటాయింపు.
▪️జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కుకు ఆమోదం.
▪️భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు 24.96 ఎకరాల భూమి.
▪️విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన.
ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం
▪️రాష్ట్రంలో కొత్తగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీ 2026-31, ఏపీ రోబోటిక్స్ – ఫిజికల్ ఏఐ విధానాలకు ఆమోదం.
▪️ఏపీ సెమీ కండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 ముసాయిదా సవరణలకు గ్రీన్ సిగ్నల్.
▪️విశాఖ జిల్లా భీమునిపట్నంలో భారీ పెట్టుబడి.. రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ (AM Intelligence) ఆధ్వర్యంలో 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం.
▪️నాయుడుపేటలో రూ.4000.20 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ మెటీరియల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం.
▪️తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్‌కు స్థల కేటాయింపునకు ఆమోదం.
▪️విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గిగా స్కేల్ ఏఐ (AI) డేటా సెంటర్‌కు సుమారు 25 ఎకరాలు కేటాయింపు.
▪️అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఈపాక్ (Epack) ఏఐ డేటా సెంటర్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ఈ యూనిట్‌తో 2,565 మందికి ఉపాధి అవకాశాలు.
▪️నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్ ఫార్మా సంస్థలకు 173.82 ఎకరాల స్థల కేటాయింపునకు పచ్చజెండా.
▪️పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ విస్తరణ ప్రాజెక్టు. దీని వల్ల1,569 మందికి ఉపాధి లభిస్తుంది.
▪️ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 30 ఎకరాల్లో ఫ్లో (FICCI FLO) ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం.
▪️అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో స్కికార్ప్ (SKICORP) ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ పార్క్, తంబళ్లపల్లెలో సుమారు 21 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ (MSME) పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
▪️రాష్ట్రంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రత కోసం డీజీపీ ఆధ్వర్యంలో మంగళగిరి కేంద్రంగా ప్రత్యేక డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటుకు ఆమోదం.
▪️రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయానికి (KVS) 5 ఎకరాల లీజు, స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం.
▪️శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ (ITI) కాలేజీ ఏర్పాటు కోసం 2 ఎకరాల స్థలం కేటాయింపు.
▪️తిరుమల శ్రీవారి ఆలయంలో ‘ప్రధాన సన్నిధి యాదవ’, ‘సన్నిధి యాదవ’ పోస్టుల ఏర్పాటుకు ఆమోదం.
▪️దేవాదాయ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ హోదాలో ‘ముఖ్య స్థపతి’ పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
▪️ఎన్టీఆర్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి.
▪️రాష్ట్రంలో థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా SMR టెక్నాలజీతో అణు విద్యుత్ ప్లాంట్ల (Nuclear Power) ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఆమోదం.
▪️విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు 5.50 ఎకరాల ఏపీ జెన్కో భూమి ఉచిత బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
▪️అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం192.68 ఎకరాల వక్ఫ్ భూమి 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఆమోదం.
▪️నాయుడుపేట సెజ్‌లో గతంలో వెబ్‌సోల్ రెన్యువబుల్స్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe