Grand Felicitation : 121 సార్లు ర‌క్త‌దానం, ఘ‌నంగా స‌న్మానం

TRINETHRAM NEWS
Grand Felicitation

Grand Felicitation : కూకట్పల్లి జూన్ 14, (త్రినేత్రం న్యూస్) : అంత‌ర్జాతీయ ర‌క్త‌దాత‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా దిశ లా ఫర్మ్ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాత‌ల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సాయి ఫేమస్ ఉడిపి టిఫిన్స్ అధినేత లింగాల ర‌వికుమార్‌ను, ఆయ‌న స‌తీమ‌ణి వడ్డే శాంతి మహేశ్వరిని హైకోర్టు ప్ర‌ముఖ న్యాయ‌వాది నాగేశ్వర్ రావు పూజారి స‌త్క‌రించి అభినందించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 121 సార్లు ర‌క్త‌దానం చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు.

ఈ సందర్బంగా ర‌క్త‌దాత ర‌వికుమార్ మాట్లాడుతూ ర‌క్త‌దానం చేయ‌డం అంటే ప్రాణ‌దానం చేయ‌డ‌మే అన్నారు.తాను ప్ర‌తీ 3 నెల‌ల‌కు ఒక‌సారి ర‌క్త‌దానం చేస్తాన‌ని చెప్పారు. ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల నీర‌సం వ‌స్తుంద‌ని కొంద‌రు అపోహ‌ప‌డ‌తార‌ని, అలాంటిది ఏమీ ఉండ‌ద‌ని వెల్ల‌డించారు.ర‌క్త‌దానం చేసేందుకు యువ‌త ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా లభించిన ఈ గుర్తింపు తమకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా రక్తదాన సేవలను కొనసాగిస్తామని దంప‌తులు రవికుమార్, శాంతి మ‌హేశ్వ‌రి తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top