CPM Demands : 10వ డీఎల్‌సీలో ఆమోదం పొందిన పోడు భూమి పట్టాలు వెంటనే పంపిణీ చేయాలి: సీపీఎం

TRINETHRAM NEWS
CPM Demands Immediate Distribution

CPM Demands : అరకులోయ జూన్ 11, (త్రినేత్రం న్యూస్): 9, 10 డీఎల్‌సీల్లో ఆమోదం పొందిన సుమారు 600 పోడు భూమి పట్టా పాసు పుస్తకాలను వెంటనే రైతులకు పంపిణీ చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు అరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
సీపీఎం మండల కార్యదర్శి కె. రామారావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ముద్రించిన పట్టా పాసు పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఉండటాన్ని కారణంగా చూపుతూ రెండేళ్లుగా పంపిణీ నిలిపివేశారని విమర్శించారు. మండల వ్యాప్తంగా వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, 9, 10 డీఎల్‌సీల్లో కేవలం 600 మందికే ఆమోదం లభించిందన్నారు. ఆమోదం పొందిన పట్టాలను కూడా పంపిణీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
అధికారులు తక్షణమే పట్టాల పంపిణీ చేపట్టాలని, లేనిపక్షంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సీపీఎం, గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, రైతులు, గిరిజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top