Government Welfare Schemes : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

TRINETHRAM NEWS
Government welfare schemes

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

Government Welfare Schemes : దేవరకొండ డివిజన్ జూన్ 10, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 246 మంది లబ్ధిదారులకు రూ.2,46,28,536 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడారు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచే గొప్ప సంక్షేమ పథకాలే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలన్నారు. వివాహ ఖర్చుల భారం కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ వంటి పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకొని, అర్హులైన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top