
వైసిపి ఎస్టీ సెల్ అల్లూరిజిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు
YCP : అరకులోయ, జూన్ 11, (త్రినేత్రం న్యూస్): 12న చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకులోయ పట్టణ కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు తెలిపారు. శెట్టి అప్పాలు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ రైతులకు అన్యాయం మోసం ద్రోహం దగా చేయడం తప్ప మరొకటి లేదని రైతుబిడ్డ అని చెప్పుకునే చంద్రబాబు రైతు కష్టాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసారని అప్పాలు విమర్శించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయం చేయడంలో సిద్ధహస్తుడని శెట్టి అప్పాలు ఆరోపించారు.
ఈనెల 12న అరకులోయలో జరిగే చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు వ్యతిరేకంగా జరిగే నిరసన కార్యక్రమానికి అరకులోయ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ఆదివాసి గిరిజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ పోరాట నిరసన కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అరకులోయ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన జడ్పిటిసిలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అప్పాలు విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe