Gathering Navachaitanya Alumni : నవచైతన్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TRINETHRAM NEWS
Gathering Navachaitanya Alumni

Gathering Navachaitanya Alumni : డిండి (గుండ్ల పల్లి )మార్చ్ 29, త్రినేత్రం న్యూస్… డిండి మండల కేంద్రంలోని నవచైతన్య ఉన్నత పాఠశాల లో 1996-97 బ్యాచ్ 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిన్ననాటి ఉపాధ్యాయులను దామోదర్ రెడ్డి, మధుసూదనాచారి మరియు ఇతర ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పూర్వజ్ఞాపకాలను తోటి మిత్రులు మరియు ఆనాటి ఉపాధ్యాయులతో నెమరు వేసుకున్నారు. ఆనాడు చదివిన చదువులు ఉపాధ్యాయులు బోధించిన విద్యాబుద్దులు, తాము ఈనాడు ఎదిగిన విధానాలగురుంచి చర్చించుకోవడం జరిగింది.

ఈ బ్యాచ్ లో అకాల మరణం చెందిన మిత్రులకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విజయ్ , సురేష్, సంతోష్,జగత్, కరుణాకర్,నర్మదా, కవిత, అరుణ,సత్యం,నవీన్,శ్రీను,యాదగిరి,వెంకటేష్, నాగేశ్వరరావు , తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top