
6 నెలల పెండింగ్ వెతనాలు తక్షణమే చెల్లించాలి
NHM : త్రినేత్రం న్యూస్ జగిత్యాల జిల్లా ప్రతినిధి : జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్… ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం రోజున జగిత్యాల సాయిరాం కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఉద్యోగులు భోజన సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రం మేకల సరస్వతి మాట్లాడుతూ ఉద్యోగులకు సెప్టెంబర్ నుండి జనవరి వరకు 6 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని, ప్రతి నెల 5వ తేదీన వేతనాలు అందరికీ చెల్లించాలని,తక్షణమే పై సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 28 మార్చి 2026 తేదీ లోపు పెండింగ్ వేతనాలు మొత్తం చెల్లించాలని చెల్లించలేని పక్షాన 29 మార్చి 2026 ఆదివారం రోజున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో మహధర్నా కు వెళ్తామని ప్రభుత్వాన్ని ఉద్యోగులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పులి శేఖర్, పుల్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

