NHM : వైద్యాధికారి డాక్టర్. అనిత కు వినతిపత్రం ఇచ్చిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

TRINETHRAM NEWS
Dr. Anita was given a petition by NHM employees

5 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి – ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

NHM : త్రినేత్రం న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి.. వరంగల్ నగరంలోని ఎస్.ఆర్.ఆర్.తోట. కరీమాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్.అనిత కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.. పెండింగులో ఉన్న 5 నెలల వేతనాలు అనగా (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మరియు జనవరి) వేతనాలు ఈరోజు అర్ధరాత్రి లోపు జీతభత్యాలు చెల్లించాలని లేనిపక్షంలో 17 మార్చి 2026 నుంచి మధ్యాహ్నం లంచ్ సమయంలో నల్ల రిబ్బన్లు ఉద్యోగులు ధరించి నిరసన కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ…

ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేసి వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని , గత చాలా సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పేద బడుగు, పేదవారికి సేవ అందించడంలో ముందు వరస లో ఉన్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులునీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్.ఆర్.ఆర్.తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సింగ్ ఆఫీసర్లు గుడి కందుల వాణి , మేకల మంజుల, గూడెపు ప్రభాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top