
జనసేన పార్టీ ముఖ్య నాయకులు చందు నాయక్, కొత్తగోల నరేష్, ఉపేందర్.
Protest : దేవరకొండ డివిజన్ మార్చ్ 15, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం కొండమల్లేపల్లి మండలంలో రెండవ పెద్ద సంత మల్లెపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన సంత నిర్వాహకుడికి జనసేన పార్టీ నాయకులు నిలదీయడం జరిగింది అనంతరం చందు నాయక్ మాట్లాడుతూ ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా ప్రజలకు తెలియకుండా అధికారులతో మాట్లాడి వేలం పాట పాడుకునేవారు సంత యజమాని అయిన ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న కూడా రైతులకు ఎటువంటి సదుపాయాలు లేకపోవడం దారుణం సంతలో రైతులు పడుతున్న బాధలు జనసేన పార్టీ నాయకులకు వారి బాధని సంప్రదించడంతో జనసేన పార్టీ రంగంలో దిగి సంత నిర్వాహకుడికి నిలదీయడం జరిగింది రానున్న రోజుల్లో రైతులు ఆవు అమ్మిన కొన్న చిట్టి వెయ్యి రూపాయలు కాకుండా 300 రూపాయలే తీసుకుని రసీదు ఇవ్వాలని మరియు సంతలో వచ్చిన రైతులకు నీరు భోజనం నీడ వెంటనే రైతులకు కావాల్సిన సదుపాయాలు చూడాలని సంత నిర్వాహకుడికి హెచ్చరించడం జరిగింది లేనియెడల సంత జరగకుండా రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటం ధర్నా నిర్వహిస్తామని జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు సంత నిర్వాకుడి పై వ్యతిరేకంగా వందల మంది రైతులతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్త గొల్ల నరేష్ బావoడ్ల సాయి పర్వతాలునవీన్ గౌస్ ఉపేందర్ తదితరులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు

