Nickname for Reliability : విశ్వసనీయత కు మారుపేరు

TRINETHRAM NEWS
Nickname for reliability

మండపేట లో రికార్డు సృష్టించిన ధీరులు….

వైసిపి కౌన్సిలర్ లకు ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యంలో సత్కారం….
ముగుస్తున్న కౌన్సిల్ పదవి కాలం…

Nickname For Reliability : త్రినేత్రం న్యూస్, మండపేట: సరిగ్గా ఐదేళ్ల క్రితం మండపేట చరిత్ర ను తిరగ రాసి టిడిపి కంచు కోట లాటి పురపాలక సంఘం ను ధీరులైన వైసిపి అభ్యర్థులు చేజిక్కించుకున్నారని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. విశ్వసనీయతకు విధేయతకు మారుపేరైన మండపేట వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లను ఆయన ఆదివారం సత్కరించారు. మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం లో జరిగిన కార్యక్రమానికి చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి తో సహా 15 మంది వైసిపి కౌన్సిలర్ లను ఆయన అభినందించారు. ఈ నెల 17 తో కౌన్సిల్ పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ 2021 – 2026 లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి కలలను సహకారం చేశారని కొనియాడారు. మంచి సలహాలతో ముందుకు తీసుకెళ్లిన కో – ఆప్షన్ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా వారందరికీ జ్ఞాపికలను అందజేశారు. వైసిపి కౌన్సిలర్ లు పోతంశెట్టి ప్రసాద్, మెర్నేని ప్రభావతి సత్యం,మందపల్లి రవికుమార్, శెట్టి కళ్యాణి, మెండు బాపిరాజు, నాయుడు లక్ష్మి సౌజన్య అయ్యప్ప, ముక్కా లోవ లక్ష్మీ దలీయ్యా, ముక్కా మేరీ స్వరూప రాణి సుబ్రహ్మణ్యం, జొన్నపల్లి విజయలక్ష్మి సత్తిబాబు,నీలం దుర్గా సత్తిబాబు, మొండి భవాని మురళి, పిల్లి శ్రీనివాస్, మారిశెట్టి సత్యనారాయణ, మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రబ్బానీ, కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, ఏం ఎస్ శాంతి కుమారి లను సత్కరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వైసిపి కార్యదర్శి రాజోలు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కర్రి పాపారాయుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, ముమ్మిడివరపు బాపిరాజు, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, సిరిపురపు శ్రీనివాస్ , పెంకే గంగాధర్, తణుకు అశోక్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top