జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Sarees distributed to women

Sarees Distributed to Women : త్రినేత్రం న్యూస్, మురమండ గ్రామం: రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బచయ్య చౌదరి జన్మదినోత్సవం సందర్భంగా మురమండ గ్రామంలో మహిళా మణులకు చిరు కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు దేవళ్ళ రామ్మోహన్ (రాంబాబు) పాల్గొని గ్రామ మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి,కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page