MLA Amilineni : రైతులకు నీరు అందిస్తే దేశంలోనే అత్యంత నాణ్యమైన పంటలు పండిస్తారు..ఎమ్మెల్యే అమిలినేని

TRINETHRAM NEWS

బీటీపీకి భూములు ఇచ్చిన రైతులకు పూర్తి పరిహారం ప్రభుత్వం అందిస్తుంది..

రైతులకు అండగా నిలుస్తున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు..

రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తూ వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రిప్పు, స్పింక్లర్లు సబ్సిడీ ద్వారా అందిస్తోంది కూటమి ప్రభుత్వం

మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే మన ప్రాంత స్వరూపమే మారిపోతుంది

కోస్తా ప్రాంతం వాళ్ళు ఇప్పటికే అనంతపురం జిల్లా సస్యశ్యామలం అవుతోంది అంటున్నారు..

143 చెరువులకు నీరందించేందుకు ముఖ్యమంత్రి నిధులు ఇస్తామన్నారు..

త్రినేత్రం న్యూస్ : ఇలా రైతుల మధ్య అది పంట పొలాల్లో ఉండి వారికి వెన్నుదన్నుగా ఉండేందుకు వారికి అన్నదాత సుఖీభవ, పీఎమ్ కిసాన్ నిధులు విడుదల చేసేందుకు మమ్మల్ని పంపిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి దేశ అత్యుత్తమ నాయకుడు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే అమిలినేని అన్నారు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందులను కళ్ళారా చూసి మేనిఫెస్టోలో రైతులకు చేదోడుగా ఉంటానని మాట ఇచ్చారని అందులో భాగంగానే నేడు అన్నదాత సుఖీభవ, పీఎమ్ కిసాన్ నిధులు విడుదల చేస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు..

నేడు శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలోని మామిడి వ్యవసాయ క్షేత్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా రైతులకు అందిస్తున్న పీఎమ్ కిసాన్, అన్నదాత సుఖీభవ మూడవ విడత నిధులను రైతు ఖాతాల్లోకి విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్థానిక రైతులు, టీడీపీ నాయకులతో కలసి పాల్గొన్నారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు 2675.97 కోట్ల రూపాయలు లబ్ది చేకూరనుండగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 50595 మంది రైతులకు 30.27 కోట్ల రూపాయలు రైతులకు వారి ఖాతాల్లోకి జమ చేయడం హర్షనీయమన్నారు..

గత ప్రభుత్వం రైతులకు కనీసం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురిచేసిందని నేడు అలాంటి పరిస్థితి లేకుండా రైతులను అవసరమైన వ్యవసాయ యంత్రాలు, యంత్ర పరికారాలు, డ్రిప్పు, స్పింక్లర్లు అందిస్తూ అండగా నిలుస్తోందని అన్నారు.కానీ కొంతమంది నాపై అనవసరంగా బురదజల్లేలా 2018 నుంచి ఆయనే కాంట్రాక్టర్ అయినా 2019 తరువాత పనులు చేయలేదని అంటున్నారు అయితే ఆ పనులను ఆపింది జగన్ ప్రభుత్వమే, కేవలం ఇది ఒక్కటే కాదు పేరూరు, హంద్రీనీవా, పోలవరం ఇలా అన్ని ఆపేసి మాపై నిందలు వెయడం ఏమిటని ప్రశ్నించారు.

అలాగే హంద్రీనీవా ప్రాజెక్ట్ కు టెండర్లు పిలుస్తున్నాం మరిన్ని ఎక్కువ నీళ్లు తీసుకువస్తామని ప్రగల్భాలు పలికిన మీరు కనీసం ఒక్క చుక్క నీరు కూడా ఎక్కువ తీసుకురాలేదని, నేడు అదే మా ముఖ్యమంత్రి హంద్రీనీవా పనులు చేసి నేడు జిల్లాకు నీళ్లు తీసుకువచ్చి జిల్లాలో ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చారని, ఒక్క కళ్యాణదుర్గం ప్రాంతానికి మాత్రమే నీళ్లు రావాల్సి ఉందని అది కూడా త్వరలోనే పూర్తి చేసి మన ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకువస్తామని తెలిపారు..

If farmers are provided with water,

You cannot copy content of this page

Scroll to Top