YouTuber Anvesh : యూట్యూబర్ అన్వేష్‌పై లుక్‌అవుట్ నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్, ఫిబ్రవరి 25:ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకున్న యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)కు మరో బిగ్‌షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.ఇటీవల అన్వేష్ అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.

ఆ తరువాత అతడు తనకు ఇంకా రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు,రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని వీడియో విడుదల చేశారు.అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియోను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో పంజాగుట్ట పోలీసులు… అన్వేష్‌కు సంబంధించిన మరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో పాటు యూట్యూబ్ ఛానళ్లను మూసివేయాలని సంబంధిత సంస్థలకు లేఖలు రాయనున్నారు.ఇప్పటికే హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lookout notices on YouTuber Anvesh

You cannot copy content of this page

Scroll to Top