MLA KP.Vivekanand : ఆధ్యాత్మిక చైతన్యం, శాంతి, ధర్మ పరిరక్షణకు నిలయాలు దేవాలయాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు జిహెచ్ఎంసి కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి చౌరస్తాలో భైరవ వీరాంజనేయ స్వామి దేవాలయ పునఃనిర్మాణ మరియు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఆధ్యాత్మిక చైతన్యం, శాంతి, ధర్మ పరిరక్షణకు నిలయాలు దేవాలయాలు అని అన్నారు. ఆలయ పునఃనిర్మాణం, అభివృద్ధిలో తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, సీనియర్ నాయకులు శిరీష ప్రవీణ్ రావు, చింతల దేవేందర్ యాదవ్, లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Temples are the abodes of spiritual consciousness,

You cannot copy content of this page

Scroll to Top