జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్ప వద్ద గల సంస్కృతి హై స్కూల్ నందు మల్లారెడ్డి హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ (నార్త్) సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. నిరుపేదలు అత్యధికంగా నివసించే జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సంస్కృతి హై స్కూల్ యాజమాన్యానికి, మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్ల బృందానికి, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ (నార్త్) సభ్యులకు నా అభినందనలు. ఉచిత వైద్య శిబిరాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ గడ్డమీది బాల్ రాజ్, కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు ఆజం, మెట్ల శ్రీను, త్రివేణి, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు బి.ఆంజనేయులు, చల్లా శ్రీనివాస్ రెడ్డి, వినోద్ జాదవ్, సిహెచ్.నరసింహులు, ఎస్. ఆర్. భాషా, మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్ల బృంధం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

take advantage of free medical camps

You cannot copy content of this page