Gram Sabha : డిండి మండల కేంద్రంలో గ్రామసభ

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి ) ఫిబ్రవరి 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం రోజు సర్పంచ్ నల్లగంతుల రవి అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో భాగంగా గ్రామ ప్రజలు వారి కాలనీలో ఉన్న సమస్యలను గ్రామ సభలో చర్చించారు.

ముఖ్యంగా కోతులు, పందులు, కుక్కల గురించి, మరియు నీటి సమస్యల చర్చించడం జరిగింది. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పాలకవర్గంతో చర్చించి మండలకేంద్రంలో లో నెలకొని ఉన్న సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని సర్పంచ్ తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సెక్రటరీ జంగయ్య,వార్డు నెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు , ప్రభుత్వ అధికారులు,గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gram Sabha at Dindi Mandal Center

You cannot copy content of this page

Scroll to Top