Mon. Mar 9th, 2026

Drinking Water Supply : మహా శివరాత్రికి ఏలేశ్వరం వచ్చే భక్తులకు త్రాగునీరు సరఫరా

TRINETHRAM NEWS

జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి

చందంపేట ఫిబ్రవరి 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోని ఏలేశ్వరం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చే భక్తులకు
15/02/2026 ఆదివారం రోజు త్రాగునీరు సమస్య ఉందని ఆలయ అధికారులు జాలే బ్రదర్స్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే మంచి మనసుతో స్పందించిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుండి డీ సి ఎం లోడ్ అంటే దాదాపుగా (30,000) ముప్పై వేల టా ట వాటర్ ప్యాకెట్లు స్టీమర్ ద్వారా ఏలేశ్వరం శివాలయానికి పంపించడం జరిగింది

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాములు మాట్లాడుతూ గత ఐదు ఏళ్ల నుండి ప్రతీ శివరాత్రికి ఏలేశ్వరం శివాలయానికి వచ్చే భక్తులకు త్రాగునీరు సమస్య తీర్చుతున్న జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. వారిపై వారి కుటుంబ సభ్యులపై ఆ పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండి వారు ప్రజాసేవలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు మద్దిమడుగు కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Drinking water supply to devotees coming to Yeleswaram

Related Post

You cannot copy content of this page