త్రినేత్రం న్యూస్… కడియం మండలం మాధవరాయుడి పాలెంకు చెందిన కాపు నేత, ఎంపీటీసీ సాపిరెడ్డి కామేష్ తండ్రి సాపిరెడ్డి రామారావు ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి నివాసానికి విచ్చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జెసిఎస్ ఇంచార్జ్ తడాల విష్ణు చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు (అను), వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్, కార్మిక నేత రామకృష్ణ తదితరులు సాపిరెడ్డి రామారావును పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


