జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 11 : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బొమ్మూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం ధవలేశ్వరం గ్రామ నాయకులతో నియోజకవర్గం కో-ఆర్డినేటర్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.

ధవలేశ్వరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి 5 సచివాలయాలకు నూతన కమిటీలను నిర్మాణం కోసం ఈరోజు సమావేశం జరిగింది పార్టీని మరింత బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో బలంగా తయారు చేయడానికి రూపకల్పన చేసే చేయడం కోసం ప్రతి గ్రామoలో నాయకులతో సమావేశాలు నిర్వహించి కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని, గ్రామాల వారీగా కొత్త నాయకత్వాన్ని పెంచుతూ పార్టీని మరింత బలోపేతం చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇదొక అవకాశం అని అన్నారు,ప్రతి ఒక్క కార్యకర్త కూడా 2029 ఎన్నికల గెలుపే మన లక్ష్యంగా పనిచేయాలని గతంలో పార్టీ కోసం చాలా మంది కార్యకర్తలు చాలా త్యాగాలు చేశారని,ఎన్ని కష్టనష్టాలు పడ్డకూడా పార్టీని విడువక అంటి పెటుకునే ఉన్నారని, పడిన కష్టాలను పక్కన పెట్టి పార్టీ కోసం మళ్లీ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జగనన్నకు సైన్యంగా మనమంత కధం తొక్కలని, మీ కర్తవ్యాన్ని మీరు చాటి చూపాల్సిన సమయం ఇదేనని అన్నారు,మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి, ఈసారి ప్రతి కార్యకర్తకు అండగా నేనున్నా అంటూ భరోసా ఇచ్చారని ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిత్వం కలిగిన వాడే మన నాయకుడని అన్నారు.

ఈ కార్యక్రమంలో గోలి దేవా,ఒంటెద్దు కృష్ణ, సత్యం రమణ,చోల్లంగి సత్యగిరి,మెండా రాజేష్,దేవులపల్లి సరిత రాణి,కళ్యాణి రెడ్డి,పందిళ్ల భాను ప్రసాద్,పసుపులేటి దేవి,చప్పిడి జ్యోతి,మోర్తా పవన్ మూర్తి,షట్టర్ బాషా,మస్తాన్ బేగ్,గూటం రాజు,నంబూరి రవి,ముత్యాల పోసికుమార్,ముత్యాల జాన్, కరుకు, ఇమ్మానియేల్,పేపకాయల చంటి,గునిపే అశోక్,బొడ్డేటి శివాజీ,దాసరి ధర్మ,పట్టపగలు వెంకట లక్ష్మి,బొడ్డు శ్రీను,పుట్టా పరేష్,,ఏలూరి కుమార్,,విప్పర్తి కుమార్,మేరప రమేష్,దిండి నాగేంద్ర,,కొత్తపల్లి శివ,తదితరులు పాల్గోన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Venu meets with Dhavleswaram village leaders

You cannot copy content of this page