త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 8: నెల్లూరు జిల్లా :కావాలి.. కావలి వైకుంఠ పురం పెదపవని రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 15వ ఆర్ధిక సంఘం నిధుల క్రింద రూ.23.50 లక్షల అంచనాతో చేపట్టనున్న తాగు నీటి సరఫరా పైపు లైను పనులకు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , ఆదివారం శంఖుస్థాపన చేశారు.
ఈ నూతన పైపులైను వలన 31, 35, 36,38 వార్డుల ప్రజలకు నీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తాగునీటి ఇక్కట్లు తొలగిస్తున్నందుకు ఎమ్మెల్యే కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, మునిసిపల్ కమిషనరు జి. శ్రావణ్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. సాయిరాం, అసిస్టంట్ ఇంజనీర్ టి. వినోద్ కుమార్, మునిసిపల్, స్వర్ణ వార్డుల సిబ్బంది, 31, 35, 36, 38 వార్డుల టీడీపీ ఇన్ఛార్జులు, ప్రజలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


