Kolan Hanmanth Reddy : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై GHMC కమిషనర్‌తో కొలన్ హన్మంత్ రెడ్డి భేటీ

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యలపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి GHMC కమిషనర్ గౌ, ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి పనుల ఆలస్యం, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి పలు కీలక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కమిషనర్ సమస్యలను సవివరంగా పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనోల సంజీవ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolan Hanmanth Reddy meets with the GHMC Commissioner

You cannot copy content of this page

Scroll to Top