ప్రగతి నగర్ బతుకమ్మ ఘట్ వద్ద ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్యక్రమం
Trinethram News : (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) మొదటి రోజు ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ బతుకమ్మ ఘట్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలేటి శ్రీనివాసరావు సారథ్యంలో, శ్రీ శుభంకరి దేవస్థానం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో దేవస్థానం వారి ఆహ్వానం మేరకు, ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ —
“స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా, సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
అనంతరం, కార్యక్రమానికి అవసరమైన పోలీస్ పర్మిషన్‌ను త్వరితగతిన మంజూరు చేయడంలో సహకరించినందుకు హన్మంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి కి మరియు బాచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలేటి శ్రీనివాసరావు, వెంకన్న (Ex-ZPTC) మరియు ప్రాంతీయ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


