Congress Party : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం

TRINETHRAM NEWS

పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్

Trinethram News : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు..

వారు మాట్లాడుతూ ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు..

గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా వేములవాడ పట్టణాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు..,

గతంలో బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని,గతంలో వారికి అవకాశం ఇస్తే వేములవాడ పట్టణ అభివృద్ధిని విస్మరించరని,ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలన్నారు..

మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ కి వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ మీకు అండగా ఉన్నారని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించలని పిలుపునిచ్చారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The Congress party flag is certain to fly high

You cannot copy content of this page

Scroll to Top