Bilya Naik : ఓటమి భయంతో సిట్ పేరిట నోటీసులు

TRINETHRAM NEWS

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి , బీ ఆర్ ఎస్ గెలుపు ఖాయం.
బీల్యానాయక్. బీ ఆర్ ఎస్ నాయకులు.

దేవరకొండ డివిజన్ జనవరి 31 త్రినేత్రం న్యూస్. కేసీఆర్ కి సిట్ పేరిట నోటీసులు ఇచ్చిఅత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని పేర్కొన్నారు. సిట్ లో ఉన్నది పోలీసులా? రేవంత్ ప్రైవేట్ సైన్యమా?
కేసీఆర్ ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే నాయకుడు కాదు యావత్ తెలంగాణ సమాజానికి నాయకుడు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పరిచి చేతికిస్తే రేవంత్ రాష్ట్రమంతా విధ్వంసం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతోనే రేవంత్ కేసీఆర్ కు సిట్ పేరిట నోటీసులు పంపారు.
బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మున్సిపల్ ఎన్నికలల్లో ఉండకుండా చేసేందుకే కేసీఆర్ కు సిట్ నోటీసులుఇచ్చారని బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బిల్యానాయక్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలను చేసినా ప్రజలు అంతా బీ ఆర్ ఎస్ పార్టీ , కెసిఆర్ వైపే వున్నారని, మున్సిపల్ ఎన్నికలలో బీ ఆర్ ఎస్ గెలుపు ఖాయం అని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fearing defeat, they issued notices in the name of SIT

You cannot copy content of this page

Scroll to Top