Trinethram News : Jan 31, 2026, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి కంటైనర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు చాకచక్యంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ట్యాంకర్‌ను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


