త్రినేత్రం న్యూస్, జనవరి 30, కపిలేశ్వరపురం మండలం, కపిలేశ్వరపురం శివారు నారాయణలంక గ్రామం వైసీపి కి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు శుక్రవారం టీడీపీ లో చేరారు. కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పువ్వల చిట్టిబాబు ఆధ్వర్యంలో వైసీపీ కి చెందిన కొప్పాడి ఏసు, కొప్పాడి వెంకటేశ్వరరావు, మసకపల్లి పల్లయ్య, మసకపల్లి శివకృష్ణ, మసకపల్లి హరికృష్ణ, డొక్కాడి రామకృష్ణ, డొక్కాడి వెంకటరమణ, పోలాబత్తుల ఏసు, మల్లాడి రామమూర్తి, మసకపల్లి సాయికృష్ణ లు మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, సమక్షంలో వైసీపీ ని వీడి తెలుగుదేశంపార్టీ లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండల అధ్యక్షులు బలవరెడ్డి సత్తిబాబు, టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షులు ముత్యాల వెంకట్రావు, మండపేట మండల అధ్యక్షులు కర్రి తాతరావు, పిల్లా శ్రీనివాసరావు, ఉరదాల త్రిమూర్తులు, సప్పటి శ్రీనివాసు, సుంకర వీర్రాజు, కుప్పాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


