మునిసిపల్ జిప్ పై కౌన్సిల్ లో వాదోపవాదాలు…
త్రినేత్రం న్యూస్, జనవరి 30, మండపేట, ప్రచారం పేరిట మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ ఆరోపించారు. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో సచివాలయ వ్యవస్థ ఉండేదని తద్వారా సచివాలయ కార్యదర్శిలు సిబ్బంది ,వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి డిమాండ్ నోటీసులు అందజేసి సకాలంలో పన్నులు వసూలు చేసే వారని పేర్కొన్నారు.
అలాంటిది ఇప్పుడు డిమాండ్ నోటీసులు ఇవ్వడం లేదని ఆరోపించారు. వేలాది రూపాయలు అద్దె చెల్లిస్తూ జీపులు తిప్పుతున్నారని ఇది చిన్న వీధుల్లోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు దీనిపై కమిషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి తమకు కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు. ఆస్తి పన్నులు సంపూర్ణంగా వసూలు చేస్తేనే కొన్ని నిధులు వస్తాయన్నారు. దీనికి అవసరమైన ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
గతంలో జరిగిన విధంగా కాకుండా జీప్ లో సిబ్బంది వెళ్లి వసూలు చేస్తున్నారని తెలిపారు. కేవలం రెండు మూడు నెలలు మాత్రమే జీపు వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రచారం చేయడం వల్ల మున్సిపాలిటీ ఆదాయం వస్తుందని దీంతో 54% వసూళ్లు సాధించామని పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయనేది అవాస్తమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మందపల్లి రవికుమార్ కు కమిషనర్ కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఓ దశలో కమిషనర్ రవికుమార్ విసుక్కోవడంతో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు జోక్యం చేసుకున్నారు. కనీస మర్యాద పాటించాలని కమిషనర్ ను హెచ్చరించారు. కౌన్సిలర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. ఇటువంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయన వెల్లడించారు.
ఇదే విషయంపై కౌన్సిలర్ కాశీన కాశీ విశ్వనాధం స్పందిస్తూ గత ఏడాది, ఈ ఏడాది మైక్ ప్రచారానికి ఎంత ఖర్చు అయిందని ప్రశ్నించారు. దీనికి అధికారులు గత ఏడాది 40 వేలు, ఈ ఏడాది లక్షా ఐదు వేలు ఖర్చు అయినట్లు చెప్పారు. జీపు అద్దె నెలకు 35 వేల రూపాయలని కమీషనర్ టీవీ రంగారావు తెలిపారు. సచివాలయ సిబ్బందిని, మోటార్ సైకిల్ ను ఉపయోగించి ఖర్చు తగ్గించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని రవి కుమార్ ప్రశ్నించారు.
దీనికి కమీషనర్ సమాధానమిస్తూ కొందరు సరైన అవగాహన లేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, మోటార్ సైకిల్ పై ప్రచారం చేసేందుకు దివంగత నేత చుండ్రు శ్రీ వర ప్రకాష్ తో కలిసి తాము కొందరితో మాట్లాడగా రోజుకు 1800 రూపాయలు డిమాండ్ చేశారన్నారు. అంతకంటే తక్కువ మొత్తానికే జీప్ వస్తుండటంతో దానిని అద్దెకు తీసుకున్నామని చెప్పారు. ఏడాది కొత్తగా 43 లక్షలు మేర పన్నులు విధించామని చెప్పారు.
ఇందుకు అవసరమైన సిబ్బంది జీప్ లోనే వెళ్ళి పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఎల్.ఆర్.ఎస్, బి.ఆర్.ఎస్ లకు సైతం ఈ జీప్ లనే వినియోగిఅంటున్నట్లు చెప్పారు. పన్నుల వసూళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మండపేట మున్సిపాలిటీ టాప్ 20 లో ఉందన్నారు. పైగా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరుకు పన్ను వసూళ్లు లింకు ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మరి కొన్ని అవసరాలకు సైతం తక్కువ ఖర్చుతోనే జీపు ను వినియోగిస్తూన్నామని వివరించారు.
గతం లో అందరికీ సక్రమంగా డిమాండ్ నోటీస్ లు వెళ్ళాయనీ, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదని రవి కుమార్ పదే పదే ప్రశ్నించారు. పట్టణంలోని ఏ వార్డులోనూ డిమాండ్ నోటీస్ లు ఇవ్వలేదని కౌన్సిలర్ లు అంతా చెప్పడంతో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కమీషనర్ వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


