YS Jagan : కూటమి ప్రజా ప్రతినిధులు బరితెగిస్తున్నారు

TRINETHRAM NEWS

Trinethram News : విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది… రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌. అసలు అతడు మనిషేనా? ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా బయపడితే, ఏ చర్యా లేదు.

ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు భరించ లేక ఒక స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఆత్మహత్యా యత్నం చేసింది. అయినా ఏ చర్య లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసినా, చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్‌ చేయించుకున్నాడు.

మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ, తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే.. అతణ్ని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ ఫోన్‌లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడు.

మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్సులు వేశాడు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. అలా రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది.

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Coalition public representatives are fighting

You cannot copy content of this page

Scroll to Top