MLA Kavya Krishna Reddy : ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎలాంటి కొదవ లేదు అన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :జనవరి 28: నెల్లూరు జిల్లా: కావలి.. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎటువంటి కొలువ లేదు అన్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, వెల్లడి,ఏ.ఏ.బి, మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కావలి నియోజకవర్గంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎలాంటి కొదవ లేదని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, స్పష్టం చేశారు.

బుధవారం కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో కావలి ఎంసిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఏబి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే దగుమటి కావ్య కృష్ణారెడ్డి,రిబ్బన్ కట్ చేసి, టాస్ వేసి అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ ఉత్సాహం నింపారు. అనంతరం ఎమ్మెల్యే .దగు మాటి కావ్య కృష్ణారెడ్డి,మాట్లాడుతూ మిత్రుల జ్ఞాపకార్థంగా ఇలాంటి క్రీడా టోర్నమెంట్ లను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముగ్గురు మిత్రుల మరణానంతరం వారి స్మారకార్థంగా ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప సంప్రదాయమని కొనియాడారు.

మిత్రులను కోల్పోయినప్పటికీ వారి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. నేటి రోజుల్లో తండ్రి ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తూ తండ్రిని కూడా ఏడాదికి ఒక్కసారి గుర్తు చేసుకోని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి సమయంలో మిత్రుల కోసం ఆర్థికంగా వెచ్చించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్ర బృందాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని , ప్రత్యేకంగా అభినందించారు.

ఇటీవల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది యువత క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ మంచి ఆటగాళ్లుగా ఎదుగుతున్నారని తెలిపారు. ఇటీవల అండర్ 14 విభాగంలో కావలి నుంచి ఏడుగురు, అండర్–19లో ముగ్గురు రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం గర్వకారణమన్నారు. విశాఖపట్నంలో జరిగిన పోటీల్లో కావలి పిల్లలు ఉత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లడం ఆనందదాయకమని చెప్పారు. కావలిలో కోచింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండి యువతకు శిక్షణ అందిస్తున్నారని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గురువులు లేకపోయినా స్వయంగా సాధన చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఆటగాళ్లు రాణించడం ప్రశంసనీయమన్నారు.

ఇటీవల కావలి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను వీక్షించేందుకు మూడు నుంచి నాలుగు వేల మంది ప్రేక్షకులు హాజరుకావడం ప్రజల్లో క్రీడల పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమన్నారు. క్రీడాకారులు ఇంకా మరింత కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, వల్లేరి వెంకట కిరణ్, షేక్ హజరత్, సుకుమార్, ఎల్లంటి వెంకటేశ్వరులు, ఆత్మకూరు నాగలక్ష్మి, మస్తాన్‌తో పాటు నిర్వాహకులు షేక్ ఇలియాజ్, అబ్దుల్ హఫీజ్, నవీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

There is no shortage of talented sportspersons

You cannot copy content of this page

Scroll to Top