Trinethram News : హైదరాబాద్ నాంపల్లిలో బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చిక్కుకున్నారు. ఫైరింజన్లు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు
ప్రమాద సమయంలో నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో రంగంలోకి దిగారు.
క్రేన్ల సహాయంతో భవనం పైభాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.
నాంపల్లి వంటి ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాలుగా మారుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో.. వాణిజ్య సముదాయాల్లో ‘ ఫైర్ సేఫ్టీ ‘ నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా నివాస గృహాల మధ్య ఇలాంటి గోడౌన్లు లేదా దుకాణాలు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొద్దిసేపటి క్రితం ఘటన స్థలికి చేరుకుని ప్రమాద తీవ్రతను స్వయంగా పరిశీలిస్తున్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


