త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలం శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఈరోజు నిర్వహించిన అక్షరాభ్యాసం కార్యక్రమం భక్తిశ్రద్ధలు ఆధ్యాత్మిక వాతావరణం మధ్య వైభవంగా జరిగింది. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసానికి శుభారంభం చెప్పారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది చిన్నారులు అడ్మిషన్లు పొందగా వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకకు మరింత శోభన చేకూర్చారు. స్కూల్ కరస్పాండెంట్ శైలజ మాట్లాడుతూ విద్య అనేది మనిషి జీవితానికి పునాది అని చిన్ననాటి నుంచి నైతిక విలువలు, క్రమశిక్షణ,సాంస్కృతి సంప్రదాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే మా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ గుణ, మునుస్వామి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాలు రాయించడం, వారు కూడా పూజలో పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


