Leaders meet New Tahsildar : నూతన తహశీల్దార్‌ రామ్ నరేష్ యాదవ్‌ను కలిసిన యాదవ సంఘం నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… దమ్మపేట మండల నూతన తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన రామ్ నరేష్ యాదవ్ ను సోమవారం యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు తహశీల్దార్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమర్థుడైన అధికారిగా పేరున్న రామ్ నరేష్ యాదవ్ దమ్మపేట మండలానికి రావడం సంతోషకరమని, వారి హయాంలో భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు త్వరితగతిన అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మండల అభివృద్ధికి పరిపాలన పరంగా అధికారులకు తమ సంఘం తరపున పూర్తి సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. తమను కలిసిన నాయకులకు తహశీల్దార్ రామ్ నరేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలుపుతూ నిబంధనల ప్రకారం ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు జోనుబోయిన శ్రీను, మాజీ జడ్పీటీసీ దొడ్డకుల రాజేశ్వరరావు, జిల్లా యాదవ సంఘం నాయకులు యారగోర్ల రాధాకృష్ణ, రాసురి వేణు, నూనె శ్రీనివాసయాదవ్, సాయిల నర్సి, లాయర్ భవాని కృష్ణ యాదవ్, తాళ్ళ శంకర్ యాదవ్, పాకనాటి శ్రీనివాస్ యాదవ్, సుబ్బారావు, కొప్పుల పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Yadava community leaders meet new Tahsildar Ram Naresh Yadav

You cannot copy content of this page

Scroll to Top