భయంతో కాదు బాధ్యతతో ట్రాఫిక్ రూల్స్ పాటించాలి :
సేవ్ లైఫ్ – సేవ్ ఫ్యామిలీ – సేవ్ సొసైటీ” నినాదంతో అవగాహన .
డిండి (గుండ్ల పల్లి) జనవరి 13 త్రినేత్రం న్యూస్. డిండి పోలీస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు రోడ్ సేఫ్టీ గురుంచి ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్ సేఫ్టీ అంటే కేవలం నియమాలు కాదు – జీవితాల రక్షణ అని డిండి ఎస్ ఐ బాలకృష్ణ తెలిపారు.ఒక క్షణం ప్రమాదం – జీవితకాల బాధ అని అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ ప్రధాన ప్రమాద కారణాలుహెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి ఇవే ప్రాణరక్షకాలు.
మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడంప్రమాదకరంరోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది, రోడ్ సేఫ్టీ పోలీసుల బాధ్యత మాత్రమే కాదు – మనందరి బాధ్యత. పిల్లలకు రోడ్ సేఫ్టీ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని అన్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత కాదు – జరగకుండా చూడాలి . బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడమే లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిండి పోలీస్ సిబ్బంది, వాహనదారులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


