జూన్ 27, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. మహమ్మదాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారులతో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలు,లోడ్ సమస్యలు,కరెంట్ అంతరాయాలపై అధికారులతో చర్చించారు.
అనంతరం మహమ్మదాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే టి రాంమోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి ఒక వరమని,అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ పథకం భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA review with electricity department officials in Mohammedabad

You cannot copy content of this page