Trinethram News : న్యూఢిల్లీ: వీధి కుక్కల దాడులపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. కుక్క దాడుల వల్ల జరిగే మరణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అలాగే కుక్క దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వాలు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
వీధి కుక్కల నియంత్రణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కోర్టు తీవ్రంగా మండిపడింది. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య వెయ్యి రెట్లు పెరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించి నిర్లక్ష్యం వహించడాన్ని సహించబోమని హెచ్చరించిన కోర్టు, వీధి కుక్కల నియంత్రణకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వాలకు సూచించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


