Gudipalli team Wins : కబడ్డీ పోటీల్లో గుడిపల్లి జట్టు ఘనవిజయం

TRINETHRAM NEWS

-అభిలాష్ ఛాలెంజ్ ట్రోఫీ కబడ్డీ నియోజకవర్గస్థాయి పోటీల్లో గుడిపల్లి మండలం ఘన విజయం.

ఎం ఎల్ ఏ బాలునాయక్ ప్రత్యేక అభినందనలు.

దేవరకొండ డివిజన్ జనవరి 13 త్రినేత్రం న్యూస్. అభిలాష్ ఛాలెంజ్ ట్రోఫీ కబడ్డీ నియోజకవర్గస్థాయి పోటీల్లో గుడిపల్లి మండలం జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో మొదటి బహుమతి సాధించి విజేతగా నిలిచింది.
గుడిపల్లి మండలంలోని ఆణిముత్యాల్లాంటి యువ క్రీడాకారులు అందరూ కలిసికట్టుగా ఆడి జట్టు స్పూర్తితో పోరాడి మండలానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ విజయంతో గుడిపల్లి మండల ప్రజలు కబడ్డీ జట్టును హర్షాతిరేకాలతో గౌరవిస్తూ, అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే బాలునాయక్ విజేత జట్టును ప్రత్యేకంగా అభినందిస్తూ, క్రీడాకారుల కృషి, పట్టుదల ఇతర యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
గుడిపల్లి మండలం మరోసారి క్రీడల్లో తన సత్తాను చాటుతూ నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించింది .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gudipalli team wins big in Kabaddi competitions

You cannot copy content of this page

Scroll to Top