త్రినేత్రం న్యూస్, కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 11: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి వేద పాఠశాల ప్రధాన వేద పండితులు, కాశీ క్షేత్రంలోని శృంగేరి పీఠం ఇన్చార్జి ఇంద్రగంటి సత్యం జన్మదిన వేడుకలు కాట్రావులపల్లి గ్రామ పెద్దలు ముసిరెడ్డి నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ఇంద్రగంటి సత్యం మీనాక్షి దంపతులను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ఇంద్రగంటి సత్యం పండితులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రును తమ వేద పాఠశాలలోని వేద పండితులు అందరితో వేద ఆశీర్వదించి ఆశీస్సులు అందించారు. కాశీ నుంచి తీసుకొచ్చిన కాశీ విశ్వేశ్వరుడి యంత్రాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించారు. శృంగేరి పీఠాధిపతులు శివకేశుల ఆలయం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎలా అభివృద్ధి చేస్తున్నారని అడిగారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎస్ వి ఎస్ అప్పలరాజు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, సూరంపాలెం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉంగరాల రాము, గోకవరం మండల టిడిపి అధ్యక్షులు పిల్లా చంటిబాబు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, బోదిరెడ్ల సుబ్బారావు, మండపాక అప్పన్న దొర తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


